10, ఏప్రిల్ 2012, మంగళవారం

దీనమ్మా జీవితం….


పొద్దున్నే నిద్ర లేచి..
బ్రష్షు పట్టి పేస్టు పెట్టి…
ట్యాపు తిప్పి..చూడగా…
బుస్సు మంటు..గాలి వచ్చె ..
నీటి చుక్క రాదాయె..
గావు కెక ఒఖ్ఖట్టెట్టి..
శక్తి కూర్చి…గొంతు చించి..
వాచ్ మేనంటు అరవగా…
వెకువేళ ఇంటికొచ్చి…
ముసుగు తన్ని.. నిద్దరోవు…
రూమ్మేటే తిట్టెనాయె..
పరుగెత్తుతు కిందకెళ్ళి…
జోగుతున్న కాపలోణ్ణి..
తట్టి తిట్టి..నిద్ర లేపి..
నిళ్ళేవని అడగగా..
ట్యాంకరోడు..హ్యాండంటు..
చావు కబురు చల్లగా…
ఛ ఛ..
చల్లదనం ఎఖ్ఖడిది…
వొళ్ళు మండి పొయెనాయె..
దీనమ్మా జీవితం.., అనుకుంటూ.
ఫోను పట్టి..క్యాను తెచ్చి..
పళ్ళు తోమాననిపించి..
పేపరట్టి చూడగా..
ఆత్మాహుతుల్..రాస్తారోకోల్…
బందులంటూ… వార్తలాయె..
విసుగు పుట్టి..పక్కనెట్టి..
టైము చూస్తే తొమ్మిదాయె..
అయ్యబాబో అనుకుంటూ..
హడవుడిగ..తయారయ్యి…
బయికునెక్కి కిక్కు కొట్టి..
ఆఫీసుకి పరుగులాయె..
ఏదేదో పీకేద్దాం..
ఎంతెంతో సాధిద్దాం..
అనుకుంటూ జొషు పుట్టి..
మెయిను రోడ్డు ఎక్కగానె..
పచ్చ లైటు ఆరిపొయి..
ఎర్ర లైటు వెలిగెనాయె..
నూటెనభై నంబరాయె..
నెత్తి మీదా సూరిబాబు..
కోపమంత కురిసెనాయె..
ముందరున్న ఎర్రబస్సు..ఘుప్పు మంటు
తిక్క సెగలు ఒఖ్ఖపెట్టు..కక్కెనాయె..
దీనమ్మా జీవితం.,
పొద్దున్నే పూసుకున్న
క్రీమంతా బొక్కాయె..
చొక్కా రంగు మారి పోయె…
నంబరేమొ సున్నాయె…
పచ్చ లైటు వెలిగెనాయె..
హమ్మయ్యా అనుకుంటూ
గాలి పీల్చి కిక్కు కొట్టి..
ఫస్టు గేరు వేస్తి గాని..
టాపు గేరు వుంటుందను
విషయమసలు తట్టదాయె…
ముక్కుకుంటు..మూల్గుకుంటు..
ఆఫీసులొ అడుగుపెట్టి.
కాఫీ కప్పు చెత బట్టి..
ఈమెయిళ్ళు చూడగానె..
పస్చిమోడి పచ్చి బండ
బూతులతొ నిండిపాయె..
అప్పటికే వేచి ఉన్న
బాసు నుంచి పిలుపులాయె..
మాసు క్లాసు మొదలాయె
అంతంటూ లెకపాయె..
దీనమ్మా జీవితం.. అనుకుంటూ
రొషమొచ్చి..సీటుకొచ్చి..
కొడు చూసి..బుర్రగోకి..
జుట్టు పీకి..దిక్కులన్ని
కలియజూసి..దారిలేక
పక్కనోడి వంక చూసి..
పిచ్చి నవ్వు ఒకటి నవ్వి..
బిక్క చచ్చు ఫేసు వంక
చూడలెక విసుగు పుట్టి,
కిందకెళ్ళి దమ్ము కొట్టి..
ఎట్టైనా ఈపూట
బగ్గు నేను ఫిక్సు చెసి
తీరాలని..నాకు నేను
తీర్మానం..ఇచ్చుకుని..
మొక్కవొని..విశ్వాసం
అంతులేని ఆత్మస్థైర్యం
కూడగట్టి..కొడుపట్టి
ఫొను ఆఫు చెసిపెట్టి..
టైము సంగతొదిలిపెట్టి..
టీము వాళ్ళ ధ్యాస విడిచి..
ప్రోబ్లమ్ము ఫిక్సు చేసి…
వాచికేసి చూడగా..
డేటు మారిపొయెనాయె…
వెను వెంటనె దేవుడికి(కస్టమరు)
పని మొత్తం సమర్పించి(చెక్-ఇన్/ఈమేల్)..
ఇంటి వైపు వెళ్తుంటె
పొద్దున్నే నన్ను పిలిచి
చీవాట్లు పెట్టినట్టి..
బాసు గారు కనిపించి….
వెర్రి నవ్వు నవ్వెనాయె…
ఆ నవ్వే
రాబొయె ప్రమోషనుకు..
సిగ్నలుగా భావించి..
హాప్పీ గా హెడ్ ఫొన్సు
నా చెవులకు తగిలించి..
పాటలాను చెసి పెట్టి..
బైకు తీసి కిక్కు కొట్టి..
ఇంటిముఖం పట్టి పొయె..
తీరిగ్గా ఇంటికొచ్చి…
ఉత్తరాల పెట్టి తెరిచి
కట్టవిప్పి చూడగా..
ఫొను బిల్లు..నెట్టు బిల్లు..
ఆ బిల్లు ఈ బిల్లు…
అన్ని కలిసి..పెద్ద చిల్లు
జెబుకేమో పెట్టెనాయె..
దీనమ్మా జీవితం.., అనుకుంటూ.
లొనికొచ్చి..ఫుడ్డు కొట్టి…
టీవి పెట్టి..చుస్తుంటె…
అమెరికాలో సెటిల్ అయిన
ఫ్రెండొకడు ఫోను చెసి …
పెళ్ళి టాపికెత్తుకుని…
మెదడంతా మెసెసి…గుజ్జంతా జుర్రేసి…
పిచ్చెక్కించెసెనాయె…
దీనమ్మా జీవితం, అనుకుంటూ…
పడుకుందామనుకుంటె…
దోమల్తో వారాయె..
ఎండలెక్కువయ్యాయిఘా…
కరంటే కట్టాయె..
కష్టపడి కునుకు తీస్తె..
ఆరింటికి కాలాయె..
ఎవరా అని చూసుకుంటె..
ఓనరింటి నంబరాయె..
ఇల్లు ఖాళీ చెయ్యమని
నెలరోజుల గడువాయె..
దీనమ్మా జీవితం.., అనుకుంటూ…
నిద్రలెచి..ఇంటి గూర్చి
వెతుకులాట మొదలాయె..
టులెట్లెన్ని చుసినా..
బేచిలర్లకియ్యరాయె…
కీళ్ళు జొళ్ళూ అరిగి పొయె..
ఒళ్ళు హూనమయ్యిపొయె.
ఇల్లు చిక్కకున్నదాయె….
పెళ్ళికాని కుర్రాడంటె..
అందరికే అలుసాయె..
దీనమ్మా జీవితం……(సశేషం..)
AMRUNAIK-8501061449

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి