వింటున్నా కంటున్నా
అనుకుంటూ ఉంటున్నా..
నాలోనే దాగుండి..
నాకన్నా ముందుండి,
నా కంటికి లోకాన్ని…
నా చెవులకు శబ్దాన్ని…
నా మనసుకి ఙ్నానాన్ని..
నా ఒంటికి జీవాన్ని…
నాకన్నా ముందుండి,
నా కంటికి లోకాన్ని…
నా చెవులకు శబ్దాన్ని…
నా మనసుకి ఙ్నానాన్ని..
నా ఒంటికి జీవాన్ని…
అందిస్తూ నాతోటి..
అణుక్షణము మాటాడేదెవ్వడు?
అణుక్షణము మాటాడేదెవ్వడు?
నే నిజమే పలకేపుడు.
మదిలొ వర్షం కురిపిస్తాడు..
తన హర్షం ప్రకటిస్తాడు…
మదిలొ వర్షం కురిపిస్తాడు..
తన హర్షం ప్రకటిస్తాడు…
అబద్ధమాడే వెళల్లో…
పెదవె వణికించేస్తాడు..
తప్పని హెచ్చెర చెస్తాడు..
పెదవె వణికించేస్తాడు..
తప్పని హెచ్చెర చెస్తాడు..
బాధతొ రగులుతు నేనుంటె..
నెత్తిన గంగను..నా కన్నులదించి..
మంటలు చల్లారుస్తాడు..
నెత్తిన గంగను..నా కన్నులదించి..
మంటలు చల్లారుస్తాడు..
ఢమ ఢమ ఢమ ఢమ
ఢమరుక నాదం
ఢమరుక నాదం
లబ్ డబ్ లబ్ డబ్
గుండె నినాదం…
గుండె నినాదం…
మూడు గుణాల్ని..
సరి చూసెందుకు..
తన సూలాన్నే సంధిస్తాడు…
సన్మార్గం చూపిస్తాడు..
సద్విమర్శ చేస్తుంటాడు..
సద్వాక్కును ఘోషిస్తాడు..
సరి చూసెందుకు..
తన సూలాన్నే సంధిస్తాడు…
సన్మార్గం చూపిస్తాడు..
సద్విమర్శ చేస్తుంటాడు..
సద్వాక్కును ఘోషిస్తాడు..
వాడి గొంతు నే నులిమేస్తే
ఘాటుగ కాటెయిస్తాదు..
ఐనా కూడా నె వినకుంటె..
దాచిన విషాన్ని నాలొ నింపి..
గుర్రాలకి బలి ఇస్తాడు..
ఘాటుగ కాటెయిస్తాదు..
ఐనా కూడా నె వినకుంటె..
దాచిన విషాన్ని నాలొ నింపి..
గుర్రాలకి బలి ఇస్తాడు..
కైలాస కోనల్లో
కొలువున్నాడంటారే…మరి..
నాలోనే దాగుండి..
నాతోటి..అణుక్షణము
మాటాడెదుతుండేదెవ్వడు?
కొలువున్నాడంటారే…మరి..
నాలోనే దాగుండి..
నాతోటి..అణుక్షణము
మాటాడెదుతుండేదెవ్వడు?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి