10, ఏప్రిల్ 2012, మంగళవారం

అక్షర యోధుడు.


అక్షరాక్షరం..జత చేరుస్తా..
అక్షర యగ్న్యం మొదలెడతా..
నాలో రగిలే అంతర్ జ్వాలకు..
అంతర్ జాలం.అదిరిపడంగ..
మెధో మధనం మొదలెడతా…
నవయుగ ధగ ధగ వెలుగులు మాపగ
పలు పలు ఇజములు పట్టు బిగించగ..
అసమానతలు..సమస్య కాగా..
సమస్య నీదా నాదని కాక..
సమస్యకె సమస్య సంధిస్తా..
మేధా ప్రగ్న్యతొ ..మది రగిలించి..
సమతా స్పూర్తికి..అజ్యం పోసి…
అద్భుత దేశ నిర్మాణంలొ..
ఉడతాభక్తి కృషి చేస్తా..
హిమదేశంలొ.ఇనప గదుల్లొ..
భద్రం గా నిద్రిస్తూ ఉన్న..
విష్ణు సఖిని నే పిలిపిస్తా..
మాతృ దేవికూపిరులూదిస్తా..
వ్యామోహం తో పీఠం పట్టి..
వ్యాపారాలకు షొకులు అద్ది..
వాడ వాడలా ఆడీ బళ్ళలొ..
రధయాత్రలనే నిత్యం చేసి..
మాయా ప్రభువుల మస్థిష్కంలొ..
సమస్యనై నే నిదురిస్తా…
నువ్వెంతంటె..నువ్వెంతంటూ..
నువు దొంగంటె..నువు దొంగంటూ..
దొర దొంగలెందరో. దోచేస్తుండగ..
లంచం దెబ్బకి మంచం పట్టి..
విద్వేషాలతొ…క్రుశించిపొయిన..
మాతృ భారతిని సేవిస్తా.

1 కామెంట్‌: